రజనీకాంత్ ఫ్యాన్స్ కు శుభవార్త

రజనీకాంత్ ఫ్యాన్స్ కు శుభవార్త

12-07-2018

రజనీకాంత్ ఫ్యాన్స్ కు శుభవార్త

పలుమార్లు వాయిదా పడి సాంకేతిక కారణాలతో అసలు విడుదలే ప్రశ్నార్థకంగా మారిన 2.0 ఎట్టకేలకు తాజాగా మరో విడుదల తేది ప్రకటించుకుంది. నవంబర్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్‌-అక్షయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒక్క తెలుగులోనే ఈ చిత్రాన్ని 75 కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గ్రాఫిక్స్‌ వర్క్స్‌ చేపట్టిన కంపెనీ దివాళా తీయడంతో, ఈ చిత్రం విడుదల తేదీ గందరగోళంలో పడింది. దానివల్ల బడ్జెట్‌ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎట్టకేలకు ఆ సమస్యలను అధిగమించి ఈ చిత్రం నవంబర్‌ 29న విడుదల కానుండడం రజనీకాంత్‌ అభిమానులకు ఊరట కలిగించే అంశం. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఉన్నందున, మరోసారి వాయిదా పడే ఉండకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.