ఈ నెల 19న 'ఆచారి అమెరికా యాత్ర' ప్రారంభం

ఈ నెల 19న 'ఆచారి అమెరికా యాత్ర' ప్రారంభం

14-03-2017

ఈ నెల 19న 'ఆచారి అమెరికా యాత్ర' ప్రారంభం

దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం చిత్రాల అనంతరం మంచు విష్ణు, జి.నాగేశ్వరెడ్డి కాంబినేషన్‌లో మూడో చిత్రంగా ఆచారి అమెరికా యాత్ర తయారుకాబోతుంది. బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 19న డా.మోహన్‌బాబు పుట్టినరోజు నాడు తిరుపతిలో ప్రారంభోత్సవం జరగనుంది. నిర్మాతలు మాట్లాడుతూ మల్లిడి వెంటకృష్ణ మూర్తి కథను  సమకూర్చారు. వినోదాత్మకంగా తెరకెక్కునున్న ఈ కథ పూర్తిభాగం అమెరికాలో జరగనుంది. మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్‌ విశేషంగా అలరిస్తుంది. నటీనటులు మరియు ఇతర సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.