ఈ నెల 28న ఉగాది సినీ పురస్కారాలు
APEDB
Ramakrishna

ఈ నెల 28న ఉగాది సినీ పురస్కారాలు

14-03-2017

ఈ నెల 28న ఉగాది సినీ పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఉగాది సినీపురస్కార వేడుకలు నిర్వహించనున్నట్లు మండలి అధ్యక్షుడు రాజావాసిరెడ్డి భూపాల్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్‌లో ఈ నెల 28న వేడుకలు జరపనున్నామన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను సత్కరించి ఉగాది సినిమా పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. మండలి ప్రధానకార్యదర్శి జె.వి.మోహన్‌గౌడ్‌ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో చలన చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడమే మండలి లక్ష్యమన్నారు. కో ఆర్డినేటర్‌ విజయవర్మ పాలకపాటి మాట్లాడుతూ 2012-16వ సంవత్సరాలకు మినుగురులు, మిధునం, నా బంగారు తల్లి, కంచె, ఊపిరి, థర్డ్‌మెన్‌, ఓమల్లి, ఓనమాలు చిత్రాలకు సంబంధించిన వారికి పురస్కారాలను అందించనున్నామన్నారు. 2016-17 ఏడాదికి గౌతమీపుత్ర శాతకర్ణి, మనమంతా, పెళ్లిచూపులు, ఎక్కడికిపోతాప్‌ చిన్నదాన, ఘాజి, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, శతమానంభవతి, ఆ ఆ, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలకు సంబంధించిన నటీనటులకు దర్శక, నిర్మాతలతో పాటు చాంబర్‌ అనుబంధ విభాగాలైన వారందరికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు.