షాకిచ్చిన ప్రియాంక?

షాకిచ్చిన ప్రియాంక?

12-06-2018

షాకిచ్చిన ప్రియాంక?

బాలీవుడ్‌ గ్లామర్‌ భామ ప్రియాంక చోప్రా అంటే ప్రస్తుతం ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఫైర్‌ అవుతున్నారు. ఇన్నాళ్లూ ఇండియన్‌ సినిమాల్లో నటించి ఈ రేంజ్‌ ఇమేజ్‌ స్వంతం చేసుకున్న ప్రియాంక ఇలా ఇండియన్‌ సినిమా గురించి చీప్‌గా మాట్లాడటం ఏమిటా అని గుర్రుగా వున్నారు. కొందరైతే ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ప్రియాంక వ్యవహారం వుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే ఈ మధ్యే హాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ నుంచి క్రేజ్‌ తెచ్చుకుంది. టీవీ సీరిస్‌తో అడుగుపెట్టి ఏకంగా సినిమాల్లోనే ఛాన్స్‌ కొట్టేసింది. దాంతో హిందీలో పలు అవకాశాలు వస్తున్నా కూడా నో చెబుతోందట. కేవలం హాలీవుడ్‌ సినిమాలకే తన కాల్షీట్లను ఇచ్చేందుకు రెడీగా వుందట. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ప్రముఖ దర్శకులు మంచి కథలతో వెళ్లినా కూడా నో చెప్పడం విశేషం. అయితే ఇటీవల జరిగిన 68 ఎమ్మీ అవార్డుల వేడుకలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియాలో తెరకెక్కే సినిమాలు ఎక్కువ భాగం మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టే తిరుగుతాయని చెప్పడంతో అందరూ ఫైర్‌ అవుతున్నారు. వెంటనే ప్రియాంక తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇండియన్‌ సినిమా ప్రేక్షకులు మండిపడుతున్నారు.