నాకు ఎయిడ్సా? చనిపోయానా?

నాకు ఎయిడ్సా? చనిపోయానా?

16-05-2018

నాకు ఎయిడ్సా?  చనిపోయానా?

ఎయిడ్స్‌తో శ్రీరెడ్డి చనిపోయిందంటూ యూ ట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టులు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిధ అంశాలపై మాట్లాడుతూ ఇటీవల వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ఆమె చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఒకరు ఎయిడ్స్‌తో చనిపోయిందంటే, మరికొందరు అకస్మాత్తుగా చనిపోయిందని, ఇంకొకరు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పరిస్థితి విషమంగా ఉందంటూ రకరకాలుగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. తనపై కక్ష సాధించేందుకు కావాలనే కొందరు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ చంద్‌పాషా బృందం దర్యాప్తు జరుపుతున్నది. ఇదిలావుండగా తాజాగా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో ఒక్కొక్కడి తాట తీస్తా జాగ్రత్త. సైబర్‌ క్రైమ్‌లో కేసులు ఫైల్‌ చేశా. ఆడప్లిలలంటే మీ ఇష్టారాజ్యానికి ఏమైనా తిట్టొచ్చు అనుకునేవారికి చెల్లు చీటి. ఇప్పటి వరకు 41 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇకపై పెద్ద తలకాయాల పని చేస్తా అని రాసుకొచ్చింది.