శ్రీవారి సేవలో మహానటి

శ్రీవారి సేవలో మహానటి

16-05-2018

శ్రీవారి సేవలో మహానటి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీనటి కీర్తి సురేష్‌ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మందిరంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహానటి చిత్రం విజయవంతం అయిన నేపథ్యంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నట్లు నటి తెలిపారు. ఆమెను చూడటానికి అభిమానులతో పాటు భక్తులు పోటీపడ్డారు.