అమెరికాలో 2000 లకు పైగా స్క్రీన్లలో భరత్ అనే నేను

అమెరికాలో 2000 లకు పైగా స్క్రీన్లలో భరత్ అనే నేను

16-04-2018

అమెరికాలో 2000 లకు పైగా స్క్రీన్లలో  భరత్ అనే నేను

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన చిత్రం భరత్‌ అనే నేను. అమెరికాలో మొత్తం 320కి పైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. 2000లకు పైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బాహుబలి తర్వాత అమెరికాలో భారీ వసూళ్ల సాధించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కైరా అడ్వాణీ కథానాయిక. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. చిత్రం ఏప్రిల్‌ 20న విడుదల సిద్ధమవుతోంది.