మ‌హాన‌టి టీజ‌ర్‌ విడుద‌ల

మ‌హాన‌టి టీజ‌ర్‌ విడుద‌ల

16-04-2018

మ‌హాన‌టి టీజ‌ర్‌ విడుద‌ల

అలనాటి తార సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం "మహానటి". మే 9న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ లుక్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అలరించింది. కొన్ని విజువ‌ల్స్ బ్లాక్ అండ్ వైట్‌లో చూపించ‌డం విశేషం. ఈ టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. విడుద‌లైన కొన్ని గంట‌ల‌లోనే టీజ‌ర్ మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించింది. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్ పోషించ‌గా, మధుర వాణి అనే జర్నలిస్ట్ పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ, జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు న‌టిస్తున్నారు. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో వైజ‌యంతి సినిమా పతాకంపై స్వప్నదత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది.