హైదరాబాద్ లో వింగ్స్‌ ఇండియా-2018 అంతర్జాతీయ సదస్సు
Sailaja Reddy Alluddu

హైదరాబాద్ లో వింగ్స్‌ ఇండియా-2018 అంతర్జాతీయ సదస్సు

08-03-2018

హైదరాబాద్ లో వింగ్స్‌ ఇండియా-2018 అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నాలుగు రోజులపాటు జరిగే అంతర్జాతీయ వైమానిక సదస్సు, ప్రదర్శనను నేడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోకగజపతిరాజు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించనున్నారు. వింగ్స్‌ ఇండియా-2018 పేరుతో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌ను ఇతివృత్తంగా ఎంపిక చేశారు. అమెరికా, జపాన్‌, జర్మనీ, రష్యా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, మలేషియా, హాంగ్‌కాంగ్‌, ఇటలీ, ఇరాన్‌, బ్రిటన్‌ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.