అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా
Sailaja Reddy Alluddu

అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా

28-02-2018

అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. అలాగే టీఆర్‌ఎస్‌కు 106 సీట్లు రాకుంటే కేసీఆర్‌ రాజకీయాలను వదిలేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏమీ చేయలేక గత పాలకులను నిందిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ చెబుతోన్నట్లు బంగారు తెలంగాణ కాదని, తమ కుటుంబాన్ని మాత్రమే బంగారంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు టీఆర్‌ఎస్‌ కమిటీలని, రైతులకు పెట్టుబడి సాయం ఎన్నికల జిమ్మిక్కని అన్నారు. తాము అధికారంలో వస్తే రూ. 2లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.