ఖమ్మంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం
Sailaja Reddy Alluddu

ఖమ్మంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం

28-02-2018

ఖమ్మంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం

ఖమ్మంలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని పార్లమెంట్‌ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఖమ్మం హెడ్‌పోస్టు ఆఫీస్‌లో దీన్ని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ కేంద్రం ఏర్పాటు చేయటంపై ఖమ్మం, చుట్టుపక్క జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వాసులు గతంలో పాసుపోర్టు కావాలంటే విజయవాడ, హైదరాబాద్‌ వంటి సూదర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఖమ్మం ఎంపి పొంగులేటి చొరవతో ఖమ్మంలో పాస్‌ పోర్టు కేంద్రం ఏర్పడటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పోర్టు కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మం, ఆశ్వారావుపేట ఎమ్మెల్యేలు అజయ్‌ కుమర్‌, ఖమ్మం నగర మేయర్‌ పాపాలాల్‌, రిజినల్‌ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.