మార్చి 4న లక్ష పెళ్లిళ్లు!

మార్చి 4న లక్ష పెళ్లిళ్లు!

26-02-2018

మార్చి 4న లక్ష పెళ్లిళ్లు!

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 4వ తేదీన బాజాభజంత్రీలతో మారుమోగిపోనుంది. ఆ ఒక్కరోజునే ఒక లక్ష పెళ్లిళ్లు ఉంటాయని అంచనా. అదే నెల 6, 11 తేదీల్లోనూ అధిక సంఖ్యలో వివాహ మూహూర్తాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాళ్లు ఎప్పుడో బుక్కయిపోయాయి. ఇప్పుడు కాకుండే మళ్లీ ఏప్రిల్‌ శ్రీరామనవమి తర్వాత మంచి రోజులు అందుబాటులోకి వస్తాయి. మూఢం, శూన్యమాసం వంటి నమ్మకాలు గల వారు సహజంగానే సరైన రోజుల కోసం ఎదురు చూస్తుంటారు. గత ఏడాది నవంబరు 23, 26 తేదీల తర్వాత మళ్లీ మంచి రోజులంటూ మార్చినెలలోనే వచ్చాయి. ఇంత వ్యవధి తర్వాత వస్తున్న, మార్చి నాలుగో తేదీ చాలా బలమైన ముహూర్తమనేది పండితుల ఉవాచ. మార్చి 4, 6, 11 తేదీల్లోని అత్యధిక ముహూర్తాలు మధ్యాహ్నం 12 గంటలకు ముందువే కావటం విశేషం.