రైతు సమితి అధ్యక్షుడుగా గుత్తా
MarinaSkies
Kizen
APEDB

రైతు సమితి అధ్యక్షుడుగా గుత్తా

26-02-2018

రైతు సమితి అధ్యక్షుడుగా గుత్తా

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నియమాకం అయ్యారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన రైతు సమన్వయ సమితి తొలి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలో అనుభవం కలిగిన గుత్తా సేవలు సమన్వయ సమితులకు ఉపయోగపడుతాయన్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీవో వెలువడే అవకాశం ఉంది.