హైదరాబాద్ లో మరో బయోకాన్ సెంటర్

హైదరాబాద్ లో మరో బయోకాన్ సెంటర్

24-02-2018

హైదరాబాద్ లో మరో బయోకాన్ సెంటర్

దేశంలోని బయోటెక్‌ దిగ్గజ సంస్థ బయోకాన్‌, తెలంగాణలోని జినోమ్‌వ్యాలీలో రూ.500 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వేయి మంది నిపుణులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. సంస్థ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా హైదరాబాద్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బయోఆసియా-2018 సదస్సుకు హాజరైన మజుందార్‌షా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ  సందర్భంగా ఈ ప్రకటన చేశారు. మా అనుబంధ సంస్థ సింజెన్‌ ఆధ్వర్యంలో జినోమ్‌వ్యాలీలో బయోకాన్‌ కొత్త పరిశోదన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు పాశమైలారంలో ఉన్న ప్రస్తుత బయో కాన్‌ పరిశ్రమను విస్తరించి, సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ పనితీరు  ప్రశంసనీయంగా ఉంది. సమర్త కార్యాచరణతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో దేశంలో అగ్రస్థానానికి ఎదుగుతోంది. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో తెలంగాణ ప్రగతి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కేటీఆర్‌ లాంటి మంత్రి తెలంగాణకు ఉండడం మాలాంటి పారిశ్రామికవేత్తకలు స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారిని మరింతగా బలరుస్తాం. తెలంగాణ, హైదరాబాద్‌ నగరం మరింత అభివృద్ధి చెందేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకోవాలి. ప్రధానంగా పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రభుత్వ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు సాగాలి అని కిరణ్‌ మజుందార్‌ షా సూచించారు.