రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపీ గుత్తా?

రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపీ గుత్తా?

23-02-2018

రైతు సమితి కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపీ గుత్తా?

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట రాష్ట్రంలో ఏర్పడిన కొత్త కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం ఆయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన నియమానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని చెబుతున్నారు. ఈ మేరకు జీఓ వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి కార్పోరేషన్‌లో మొత్తం 42 మంది సభ్యులు ఉంటారు. అందులో 30 మంది జిల్లా సమితుల నుంచి ప్రతినిధులు ఉంటారు. మిగిలిన 12 మంది నేతలు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను ముఖ్యమంత్రి నామినేట్‌ చేయనున్నారు.

గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్వవసాయ కుటుంబానికి చెందిన వారు, ఆయన నల్లగొండ లోక్‌సభ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచారు. తర్వాత ఆయన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మొదట్లో ఆయన జనతా  పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కొంతకాలం రంగారెడ్డి-నల్లగొండ పాల డైయిరీ చైర్మన్‌గా కొనసాగారు.