హెలెన్ జిల్ ఫెలోషిప్ కు ఎంపికైన ఖమ్మం యువకుడు

హెలెన్ జిల్ ఫెలోషిప్ కు ఎంపికైన ఖమ్మం యువకుడు

23-02-2018

హెలెన్ జిల్ ఫెలోషిప్ కు ఎంపికైన ఖమ్మం యువకుడు

అమెరికాలో పేరొందిన మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల పైన్‌ఆర్ట్స్‌ కోర్సు అభ్యసించటానికి ఖమ్మం నగరానికి చెందిన ఐ.నిశాంత్‌ ఎంపికయ్యాడు. వివిధ దేశాల నుంచి మొత్తం 1800 మంది అభ్యర్థులు పోటీపడగా 12 మందిని ఎంపిక చేశారు. సృజనాత్మక రచయితలకు ఇచ్చే హెలెన్‌ జిల్‌ ఫెలోషిప్‌కు భారత దేశం నుంచి ఎంపికైన తొలి విద్యార్థి, ప్రపంచంలోనే పిన్న వయస్కుడు నిశాంతే. ప్రఖ్యాత పత్రిక ట్రిబ్యూన్‌ వ్యవస్థాపకుడి సతీమణి అయిన హెలెన్‌ జిల్‌ పేరు మీదుగా ఈ ఉపకారవేతనం అందజేస్తారు. దీనికింద సంవత్సరానికి రూ.1.60 లక్షల డాలర్లు (సుమారు రూ.కోటీ నాలుగు లక్షలు) అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. నిశాంత్‌ ఖమ్మంలోని న్యూఎరా విద్యాసంస్థల అధినేత ఐవీ రమణారావు, డాక్టర్‌ లక్ష్మిల ఏకైక కుమారుడు.తమ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్‌లో చుక్కా రామయ్య వద్ద ఇంటర్‌ వరకు, నోయిడాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం అమెరికాలో వెబ్‌ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.