హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు

హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు

23-02-2018

హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు

కమ్యూనికేష్లన అంశంపై నిర్వహించే జాతీయ సదస్సు (నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కమ్యూనికేషన్స్‌)కు ఈసారి ఐఐటీ హైదరాబాద్‌ వేదికైంది. సంగారెడ్డి జిల్లా కంది మండల సమీపంలో ఉన్న ఐఐటీ ప్రాంగణంలో ఈ నెల 25 నుంచి 4 రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. దేశంలో ఉన్న ఐఐటీలు, ఐఐఎస్‌సీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కమ్యూనికేషన్లు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, నెట్‌వర్క్‌ అంశాల మీద కీలక ప్రసంగాలతో పాటు కార్యశాలలు ఉంటాయి. ప్రఖ్యాత విద్యా సంస్థలతోపాటు ప్రముఖ కంపెనీలకు చెందిన మొత్తం 18 మంది ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. మెషిన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, మెబైల్‌ సోషల్‌ నెట్‌వర్క్స్‌ తదితర అంశాలపై విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు.