మంత్రి పద్మారావుకు అమెరికన్‌ ప్రజాప్రతినిధి ప్రశంసలు

మంత్రి పద్మారావుకు అమెరికన్‌ ప్రజాప్రతినిధి ప్రశంసలు

22-02-2018

మంత్రి పద్మారావుకు అమెరికన్‌ ప్రజాప్రతినిధి ప్రశంసలు

పేదప్రజల వైద్యసేవలకు ఉపకరించే ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు వివిధ పథకాలు సద్వినియోగం చేసుకోవటంలో చొరవచూపుతున్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మరావుగౌడ్‌కు ఓ అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని కెనడా దేశానికి సంబంధించిన అల్బార్టా రాష్ట్ర (ప్రావిన్స్‌ ఆఫ్‌ ఆల్భార్టా) యునైడెట్‌ కన్సర్వేటివ్‌ పార్టీ ఉపనాయకురాలు లీల షరాన్‌ అహీర్‌ రాష్ట్రమంత్రి పద్మారావుగౌడ్‌ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ సికింద్రాబాద్‌లోని మంత్రి కార్యాలయానికి ఓ లేఖ పంపించారు. ఇటీవల తన కుటుంబ వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆమె భారతదేశానికి వచ్చారు. నగర పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని రెయిన్‌హోంకు కేంద్రప్రతినిధుల బృందంతో కలిసి ఆమె సందర్శించారు. రెయిన్‌బో హోం నిర్వహకులు, చిన్నారులతో తాను చాలా సేపుగడిపి ముచ్చటించానని ఆమె తెలిపారు. హోంలో వాలంటీర్లు వ్యవహరిస్తున్న తనబంధువులు గోవర్దన్‌దర్శి, రాధిక దర్శి అభ్యర్థన మేరకు హోం కార్యకలాపాలు స్వయంగా సునిశీతంగా పరిశీలించానని తెలిపారు. ఈ క్రమంలో మంత్రి పద్మారావు తనపని వత్తిడుల్లో సైతం పేదప్రజలకు, నియోజకవర్గానికి చెందిన చిన్నారులకు అందిస్తున్న సేవలు తెలుసుకుని మంత్ర ముగ్ధురాలిని అయ్యాయని లీలషరాన్‌ అహీర్‌ వివరించారు. పద్యారావు సేవలు ప్రశంసిస్తూ అభినందనులు తెలిపారు.