హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సు

హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సు

22-02-2018

హెచ్‌ఐసీసీలో బయో ఆసియా సదస్సు

తెలంగాణలో మరో ప్రతిష్ఠాత్మక  సదస్సు బయో ఆసియా-2018 నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హెచ్‌ఐసీసీలో మూడురోజుల పాటు జరిగే ఈ సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 60  దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే సరైన సమయం అనే నినాదంతో జీవశాస్త్రాలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది. బయో ఆసియాకు హైదరాబాద్‌ శాశ్వత వేదిక. 14 సంవత్సరాలుగా దీనిని నిర్వహిస్తున్నారు. 15వ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేసింది. జీవశాస్త్రాలు,  ఔషధ,  వైద్యరంగాల్లోని పారిశ్రామికవేత్తలు, నిపుణులు, కార్పొరేటు సంస్థల అధిపతులు చర్చల్లో పాల్గొంటారు.