మాంసం ఉత్పత్తిలో పెట్టుబడులు

మాంసం ఉత్పత్తిలో పెట్టుబడులు

22-02-2018

మాంసం ఉత్పత్తిలో పెట్టుబడులు

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు మార్చిలో రాష్ట్రంలో పర్యటించేందుకు మాంసం ఉత్పత్తి రంగం సంస్థల ప్రతినిధులు అంగీకరించారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్‌ పుడ్‌-2018 ట్రేడ్‌ షోలో పాల్గొన్న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న తెలంగాణ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44 లక్షల గొర్రెల పంపిణీ జరిగిందని, చేపల పెంపకాన్నీ ప్రోత్సహిస్తున్నామన్నారు.