కాంగ్రెస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి?
MarinaSkies
Kizen
APEDB

కాంగ్రెస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి?

22-02-2018

కాంగ్రెస్ లోకి నాగం జనార్దన్ రెడ్డి?

మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన, కొద్దికాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికలో బీజేపీ నుంచి జనార్దన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీగా, ఆయన కుమారుడు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరు ఓడిపోయారు. అప్పటి నుంచి జనార్దన్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బీజేపీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ భవిష్యత్‌ కార్యచరణపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రావడంతో ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

తాజాగా రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌ కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు జనార్దన్‌రెడ్డిని రాహుల్‌ దగ్గరకు తీసుకెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నాగం ఆసక్తి చూపిస్తున్నారని, రాహుల్‌ నుంచి సృష్టమైన హామీ లభించినట్లు తెలిసింది. మార్చి 18 తర్వాత ఆయన కాంగ్రెస్‌ చేరే అవకాశాలున్నాయి. దీనిపై నాగంను సంప్రదించగా, నియోజకవర్గంలో తన అభిమానులు కాంగ్రెస్‌లో పార్టీలో చేరమని కోరుతున్నారన్నారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.