బిఎస్ఇ లిస్టింగ్ లో హైదరాబాద్ : మేయర్ బొంతు

బిఎస్ఇ లిస్టింగ్ లో హైదరాబాద్ : మేయర్ బొంతు

22-02-2018

బిఎస్ఇ లిస్టింగ్ లో హైదరాబాద్ : మేయర్ బొంతు

బిఎస్‌ఇ లిస్టింగ్‌లో రెండవ నగరంగా హైదరాబాద్‌ ఉందని, ఇది గర్వకారణమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. పన్నుల విషయంలో జిహెచ్‌ఎంసి విధానాలు, అధికారుల చొరవ దీనికి కారణమని ఆయన చెప్పారు. పట్టణీకరణతో మున్సిపాలిటీలు సొంతంగా నిధులు సమకూర్చుకోవడం అవసరమని ఆయన అన్నారు.

బల్దియా అభివృద్ధికి ఆర్థిక సహకారం అవసరమని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. బాంబే స్టాక్‌ ఎక్సేóంజ్‌ ద్వారా నిధులు సేకరించనున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపాలిటీలు రెవిన్యూను జనరేట్‌ చేస్తాయని ఆయన అన్నారు. 8.9 శాతం వడ్డీతో అప్పు తీసుకుంటున్నామని మళ్లి తీర్చే అవకాశం సులువగా ఉంటుందని ఆయన చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయిలకుగాను ముందుగా 200 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.