హైదరాబాద్ లో విప్రో యూనిట్
Sailaja Reddy Alluddu

హైదరాబాద్ లో విప్రో యూనిట్

22-02-2018

హైదరాబాద్ లో విప్రో యూనిట్

సౌందర్య సాధనాల తయారీ సంస్థ విప్రో కన్యూమర్‌ కేర్‌ ప్రాడక్ట్స్‌ రాష్ట్రంలో ఒక యూనిట్‌ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మహేశ్వరం మండలంలో రూ.220 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ఈ ప్లాంట్ను నెలకొల్పనున్నారు. ఈ యూనిట్లో సబ్బులు, ఇతర సౌందర్య సాధనాలు తయారు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే విప్రో సంస్థ ఇతర విభాగాల్లో రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తోందని, నూతనంగా తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆ సంస్థకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు కృతజ్ఞతలు తెలిపారు. టిఎస్‌-ఐపాస్‌ ద్వారా ఇప్పటికే అనేక మెగా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు మరో ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం ఇక్కడి పెట్టుబడి అనుకూల వాతావరణానికి అద్దం పడుతుందని కేటీఆర్‌ అన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఇతర పెట్టుబడి అవకాశాలను విప్రో వైస్‌-చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్జీకి మంత్రి తెలిపారు.