హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

07-02-2018

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు

మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ నగరం వేదిక కానుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ (డబ్ల్యుసీఐటి) సదస్సు హెచ్‌ఐసీసీలో జరగనుంది. ఈ విషయాన్ని సదస్సు కోర్‌ కమిటీ సభ్యులు, పెగాసిస్టమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  ఇ.సుమన్‌ రెడ్డి తెలిపారు. ఈ సదస్సు తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాలు పోటీపడినా తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్‌లోని సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.