22 నుంచి బయో-ఆసియా సదస్సు

22 నుంచి బయో-ఆసియా సదస్సు

06-02-2018

22 నుంచి బయో-ఆసియా సదస్సు

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియన్‌ బయోటెక్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏబీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి హెచ్‌ఐసీసీలో మూడు రోజుల పాటు బయో-ఆసియా సదస్సు జరగనుంది. ఈ సదస్సును కేంద్ర ప్రభుత్వంతో పాటు, తెలంగాణ సర్కారు నిర్వహించనున్నాయి.  ఈ సదస్సు తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు సందర్భంగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక జినోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డును స్విట్జర్లాండ్‌కు చెందిన మైకేల్‌ ఎన్‌ హాల్‌కు అందజేయనున్నారు. జీవక్రియ నియంత్రణలో పోషక పదార్థాలపాత్ర-కణజాల పెరుగుదల అంశంపై ఈయన జరిపిన పరిశోధనలకుగాను ఈ అవార్డును అందజేయనున్నారు.