తెలంగాణలో మరో కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ

05-02-2018

తెలంగాణలో మరో కొత్త పార్టీ

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఊపిరిపోసుకోనుంది. తెలంగాణ ఐకాస చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పడినా రాష్ట్రంలో ఐకాస కొనసాగుతుందనీ, ఐకాస ఆధ్వర్యంలో సమాంతరంగా రాజకీయ, సామాజిక ఉద్యమాలు కొనసాగుతాయని ఆయన సృష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని నిర్వహించిన రైతాంగ సమస్యలపై ఉద్యమ కార్యచరణ వేదిక నుంచి కోదండరాం తన రాజకీయ ప్రవేశంపై సృష్టతనిచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌పై ఇప్పటికే యుద్ధాన్ని ప్రకటించిన కోదండరామ్‌, తాను పెట్టబోయే పార్టీకి తెలంగాణ జన సమితి అని పేరును ఖారారు చేసినట్టు సమాచారం. పార్టీ గుర్తుగా రైతు-నాగలి ని నిర్ణయించినట్టు తెలంగాణ ఐకాస వర్గాలు తెలిపాయి.

ఇక పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులు దాదాపు పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జెండా, ఎజెండాలు కూడా ఖరారయ్యాయని, పలు పార్టీల నుంచి చేరికలు, నాయకత్వ అంశాలపై చర్చలు సాగుతున్నాయని టీ-జాక్‌ నేతలు అంటున్నారు.