17న హైదరాబాద్ కు అన్నా హజారే

17న హైదరాబాద్ కు అన్నా హజారే

05-02-2018

17న హైదరాబాద్ కు అన్నా హజారే

హైదరాబాద్‌ నగరానికి ఈ నెల 17న అన్నాహజారే రానున్నారని రజనీకాంత్‌ ఎర్రబెల్లి తెలిపారు. రైతుని బతికించడం, ఎన్నికల వ్వవస్థని సంస్కరించడం, అవినీతి అంతం చేయడం అనే మూడు నినాదాలతో మార్చి 23 నుంచి ఢిల్లీలో నిరాహార దీక్ష తలపెట్టనున్న సందర్భంగా అందుకు సన్నాహంగా నగరంలోని ఏవీ కాలేజ్‌ గ్రౌండ్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నట్లు తెలిపారు. హిమయత్‌నగర్‌లోని అమృత ఎస్టేట్‌లో అన్నాహజారే సభకు సన్నాహంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సోషల్‌ పోస్ట్‌, ఇండియా అగనెస్ట్‌ కరప్షన్‌ వలంటీర్స్‌ సంస్థ (ఐఏసీవీఏ)లు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి 70970 50005కు మిస్‌కాల్‌ ఇవ్వాలన్నారు. వలంటీర్‌గా సేవలందించేవారు 7306030630లో సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌ ఎర్రబెల్లి, శివప్రసాద్‌, చంద్రశేఖర్‌, రమాకాంత్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.