బీజేపీ గూటికి ఎన్ఆర్ఐ అమరేందర్ రెడ్డి

బీజేపీ గూటికి ఎన్ఆర్ఐ అమరేందర్ రెడ్డి

05-02-2018

బీజేపీ గూటికి ఎన్ఆర్ఐ అమరేందర్ రెడ్డి

వనపర్తి జిల్లాకు చెందిన కొత్త అమరేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమరేందర్‌రెడ్డి పెద్దసంఖ్యలో అభిమానులు, అనుచరులతో తరలివచ్చారు. ముందుగా అమరేందర్‌రెడ్డి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ అమరేందర్‌ రెడ్డిని పార్టీలో చేరకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు పెద్దఎత్తున ఒత్తిడి చేశారన్నారు. కానీ వాటికి తలవొగ్గకుండా బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం ఈ చేరికలేనని అన్నారు. అమరేందర్‌రెడ్డి రాకతో వనపర్తిలో పార్టీ మరింత పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పతాకం వనపర్తిలో ఎగారాలని లక్ష్మణ్‌ అభిలాషించారు.