సీఎం కేసీఆర్ మరో చరిత్ర

సీఎం కేసీఆర్ మరో చరిత్ర

03-02-2018

సీఎం కేసీఆర్ మరో చరిత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సచివాలయానికి వచ్చి శనివారానికి (ఫిబ్రవరి 3)కి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది ఫిబ్రవరి 2వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత మళ్ళీ సచివాలయంలోకి అడుగుపెట్ట లేదు. ప్రగతి భవన్‌, ఫాం హౌస్‌ నుంచే పరిపాలన సాగిస్తున్నారు. ప్రభుత్వపరంగానూ, పార్టీపరంగానూ అన్ని నిర్ణయాలకు కేంద్రం ఈ రెండే. కలెక్టర్ల సమావేశాలు గానీ, మంత్రివర్గ సమావేశాలుగానీ, వివిధ మంత్రిత్వ శాఖల సమీక్షా సమావేశాలుగానీ, ముఖ్యుల కలయిక గానీ ప్రగతి భవన్‌లోనే జరుగుతున్నాయి. పరిపాలనా అవసరాలకు ప్రస్తుత సచివాలయం సౌకర్యవంతంగా లేదని గతంలోనే వ్యాఖ్యానించిన కేసీఆర్‌, డిసెంబరు లో జరిగిన శానససభా సమావేశాల సందర్భంగా చెత్త సచివాలయం అని వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలుసు.

అసెంబ్లీ సాక్షిగా స్వయంగా చెత్త సచివాలయం అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి ఇక వస్తే నామోషీ అని భావించారో ఏమో అక్కడ అడుగుపెట్టడమే మానేశారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కుమార్తె ఎంపీ కవిత హఠాత్తుగా సచివాలయానికి రావడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఏడాది కాలంగా సచివాలయం ముఖం చూడకుండా పరిపాలన సాగించిన కేసీఆర్‌ మరో చరిత్ర సృష్టించారు. ఆయన కోరుకున్న వాస్తు సచివాలయం ఏర్పడేంత వరకు ఇక చెత్త సచివాలయం కు రారేమో. అయినా సచివాలయ సిబ్బందీ ఆందోళనపడొద్దు.