హైదరాబాద్ నగరంలో 24గంటల్లో ఏకంగా 7 హత్యలు జరిగాయి..!!

హైదరాబాద్ నగరంలో 24గంటల్లో ఏకంగా 7 హత్యలు జరిగాయి..!!

02-02-2018

హైదరాబాద్ నగరంలో 24గంటల్లో ఏకంగా 7 హత్యలు జరిగాయి..!!

దీంతో స్థానికులు బెంబేలెత్తుతుండగా పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైంది. అయితే... మృతుల్లో ఓ పాపతో సహా ఐదుగురు మహిళలు ఉండడం గమనార్హం. సోమవారం చందానగర్‌లో భర్త చేతిలో భార్య, కూతురు, అత్త హతం అయ్యారు. అలాగే నెక్నాంపూర్‌లో ప్రేమ వ్యవహారంలో రజినీసింగ్‌ హత్య జరిగింది. ఇక ఈరోజు ఉదయం కొండాపూర్ బొటానికల్‌గార్గెన్‌ దగ్గర మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమెను ముక్కలుగా కోసి ఓ గోనె సంచిలో మూటకట్టారు. అలాగే హయత్‌నగర్‌లో అనూష అనే యువతి హత్యకు గురైంది.ఇలా వరుసగా హత్యలు జరగడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలవుతోంది.