వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం కేసీఆర్
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం కేసీఆర్

02-02-2018

వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం కేసీఆర్

మేడారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు. గద్దెల వద్దకు బంగారాన్ని మోసుకెళ్లి వనదేవతలకు సమర్పించారు. ముఖ్యమంత్రి కుటుంబసమేతంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంటన సతీమణి శోభ, మనవడు హిమాన్షు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

Click here for Event Gallery