సమక్క-సారక్కను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

సమక్క-సారక్కను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

02-02-2018

సమక్క-సారక్కను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమ్మక-సారక్కలను దర్శించుకున్నారు. మేడారం జాతరకు విచ్చేసిన ఆయన వన దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉపరాష్ట్రపతి వెంకయ్య సమ్మక సారక్క గద్దెలకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దేవతలపై పసుపు, కుంకుమలు చల్లారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకముందు ఆయన తులాభారం ఊగారు. వన దేవతలకు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉపరాష్ట్రపతి వెంటే ఉన్నారు. వెంకయ్యను మంత్రి కడియం సన్మానించారు.