రామయ్య పెళ్లికొడుకాయనే

రామయ్య పెళ్లికొడుకాయనే

13-03-2017

రామయ్య పెళ్లికొడుకాయనే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పెళ్లి పనులు వైభవంగా ప్రారంభమయ్యాయి. హోలీ పర్వదిన సందర్భంగా రామయ్యను పెళ్లికొడుకును చేసి, వసంతోత్సవం నిర్వహించారు. పెళ్లి తలంబ్రాలు, పసుపు కొట్టే పనులు ప్రారంభించారు. ఆర్డీవో శివనారాయణరెడ్డి, దేవస్థానం ఇవో తాళ్లూరు రమేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తులు తలంబ్రాల బియ్యం కలిపారు. అత్తరు, పసుపు, కుంకుముల కలిపారు. ఈ సందర్భంగా రోటిలో పసుపుకొమ్ములు వేసి పసుపు కొట్టారు. చిత్రకూటమండపంలో జరిగిన ఈ వేడుక వైభవంగా సాగింది. వసంతోత్సవం కన్నులపండువగా చేశారు. సీతారామచంద్రులు వసంతమాడారు. బంగారు ఊయలలో సీతారమచంద్రులు ఉంచి డోలోత్సవం జరిపారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించారు.