వనం నుంచి జనంలోకి సమ్మక్క

వనం నుంచి జనంలోకి సమ్మక్క

02-02-2018

వనం నుంచి జనంలోకి సమ్మక్క

లక్షలాది భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, గిరిజన పూజారుల పూజలు, డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ, సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి తరలివచ్చింది. మేడారంలో గద్దెలపై కొలువై భక్తులకు దివ్వదర్శనం ఇస్తోంది. జాతర రెండో రోజైన గురువారం సమ్మక్కను చిలకలగుట్టపై నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠాంచారు. ఈ అద్భుత ఘట్టాన్ని గిరిజన పూజరులు కనులపండువగా నిర్వహించారు.