నేటి నుంచే మేడారం మహాజాతర

నేటి నుంచే మేడారం మహాజాతర

31-01-2018

నేటి నుంచే మేడారం మహాజాతర

ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా, తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి గాంచిన తెలంగాణలోని మేడారం మహాజాతర నేటి నుండి ప్రారంభం కాబోతున్నది. విగ్రహాలు లేని శ్రీసమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో ప్రతిబింబిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఆరంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ మహాజాతరకు నేడు అంకురార్పణ జరగనుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 31న సాయంత్రం సాలరమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. ఫిబ్రవరి 1న చిలకలగుట్ట నుండి తల్లి సమ్మక్క రాక, 2న గద్దెలపై కొలువుదీరిన తల్లులకు భక్తజనులు మొక్కలు చెల్లిస్తారు. 3వ తేదీన వనదేవతలు తిరిగి వనప్రవేశం చేరడంతో జాతర ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.