ఫిబ్రవరి 2న మేడారం జాతరకు సీఎం కేసీఆర్

ఫిబ్రవరి 2న మేడారం జాతరకు సీఎం కేసీఆర్

29-01-2018

ఫిబ్రవరి 2న మేడారం జాతరకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 2న తెలంగాణ కుంభమేళం మేడారం మహాజాతరకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలుత 2016లో జాతర జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని జాతర నిర్వహించింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కారణాలతో జాతరకు వెళ్లలేకపోయారు. ఉద్యమ నేతగా 2012లో సతీసమేతంగా మేడారం వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత తల్లుల చెంతకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ మహాజాతరకు ముఖ్యమంత్రి హోదాలో రావడం ఇదే తొలిసారి.