దావోస్ లో ప్రపంచ వాణిజ్య సమావేశాల ముగింపు

దావోస్ లో ప్రపంచ వాణిజ్య సమావేశాల ముగింపు

27-01-2018

దావోస్ లో ప్రపంచ వాణిజ్య సమావేశాల ముగింపు

దావోస్ లో జనవరి 22 నుండి 26 తేదీ వరకు ఐదు రోజులు నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సమావేశాలు ముగిశాయి.

దీనిలో భాగంగా చివరిరోజున అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ గారు వివిధ సభల్లో పాల్గొని మిగతా ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు అందరినీ ఎక్కువమందిని తెలంగాణ లో  పెట్టుబడులు పెట్టాలని కోరారు. దీనిలో భాగంగా NOVARTIS (నోవార్టిస్) అనే సంస్థ ప్రస్తుతం ఉన్న పెట్టుబడుల సంఖ్యను రెట్టింపు చేసింది. అలాగే మంత్రి కేటీఆర్ గారు IT ని సెకండ్ టైర్ సిటీస్ కి విస్తరణలో భాగంగా టెక్ మహీంద్రాను వరంగల్ లో వారి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఒప్పందం చేసుకున్నారు. మిగితా అన్ని దేశాల నుంచి కూడా తెలంగాణ ఇండస్ట్రీ పాలసీ గురించి మరియు IT పాలసీ గురించి వివరిస్తూ తెలంగాణ లో మిగిలిన అన్ని రంగాలలో కూడ పెట్టుబడులు పెట్టడానికి కలిగిన అవకాశాలను వివరిస్తూ తెలంగాణాకు రావాలని మంత్రి KTR గారు ఆహ్వానించారు.

ప్రపంచ వాణిజ్య సదస్సులో ఈ ఐదు రోజుల సదస్సు కి రావడం చాల మంది పారిశ్రామిక వ్యక్తులను కలవడం ఒక గొప్ప అనుభూతి అని TRS పార్టీ  ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారు అన్నారు.

ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ గారి వెంట హైదరబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు మరియు TRS పార్టీ  ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారు ఉన్నారు.

Click here for Photogallery