రాజ్ భవన్ లో ఎట్ హోం

రాజ్ భవన్ లో ఎట్ హోం

27-01-2018

రాజ్ భవన్ లో ఎట్ హోం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు వినోద్‌, దత్తాత్రేయ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన హాజరుకాలేపోయాని గవర్నర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుపై గవర్నర్‌ ప్రశంసలు కురిపించి గవర్నర్‌ పదవికే మచ్చ తెచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ ఎట్‌ హోం కార్యక్రమాన్ని బహిష్కరించారు. అయినా ఆ పార్టీ సీనియర్‌ నేతలు దానం నాగేందర్‌, రాపోలు ఆనంద భాస్కర్‌ ఎంట్‌ హోం కార్యక్రమానికి హాజరుకావడం గమనార్హం.