పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

25-01-2018

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న మంత్రి  రెండు రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఆయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు. ఉదయం ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈవో అంతోనీ ఫెర్నాండెస్‌, ఉప కార్యనిర్వాహణాధికారిని ఎయిరీస్‌ ఓమర్‌తో సమావేశం అయ్యారు. రానున్న రోజుల్లో విమానయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లోని విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకుందని తెలిపారు. నోవార్టిస్‌ కంపెనీపబ్లిక్‌ పాలసీ హెడ్‌ పెట్రాలక్స్‌తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీ గురించి వివరించారు. నగరంలో ఇప్పటికే భారతదేశం లైఫ్‌ సైన్సెస్‌ క్యాపిటల్‌గా ఉందన్నారు. నగరంలో నోవార్టిస్‌ కార్యకలాపాల విస్తరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. నోవార్టిస్‌కు నగరంలో ఆర్‌అండ్‌డి డాటా సపోర్టు, ఆనాలిటిక్స్‌ కార్యకలాపాలు కొనసాగిస్తుందన్నారు.

హైదరాబాద్‌ నగరంలో సంస్థ అభివృద్ధి పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90వేల చదరపు అడుగల ల్యాబరోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్తగా సుమారు 150 మంది పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలో జినోమ్‌ వ్యాలీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. పూర్తి వివరాలు నోవార్టిస్‌ త్వరలోనే అందిస్తుందని మంత్రి తెలిపారు. మిత్సుబుషి హేవీ ఇండస్ట్రీస్‌ కార్యనిర్వాహఖ ఉపాధ్యక్షులు కెన్‌ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. తమ కంపెనీలో భారీ ప్రాజెక్టుల అవకాశాల కోసం చూస్తుందని మంత్రి వారికి వివరించారు. ప్రధానంగా పారిశ్రామిక వాడలు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపై మిత్సుబుషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని మంత్రి కోరారు. మిత్సుబుషి ముందు వచ్చి జపనీస్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజ్‌స్‌ పార్కును తెలంగాలో ఏర్పాటు చేయాలని కోరారు.