తెలంగాణ ప్రగతి, విధానాలను విశ్వవ్యాప్తం చేస్తాం

తెలంగాణ ప్రగతి, విధానాలను విశ్వవ్యాప్తం చేస్తాం

24-01-2018

తెలంగాణ ప్రగతి, విధానాలను విశ్వవ్యాప్తం చేస్తాం

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ద్వారా తెలంగాణ ప్రగతి, పారిశ్రామిక విధానాలను విశ్వవ్యాప్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలోని వనరులు, ఇతర అనుకూల అంశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేసి పెట్టుబడులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన గత మూడున్నరేళ్లలో ఈ సదస్సులకు ఆహ్వానం వస్తున్నప్పటికీ తాను తొలిసారిగా హాజరయ్యాయని, అతి పెద్ద వేదికలో పాల్గొనడం ఉద్విగ్నంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు.