తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్?

తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్?

23-01-2018

తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్?

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీషాక్‌ తగలనుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరగ్గా ఆది, సోమవారాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైనట్లు సమాచారం. ఇందుకు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ ప్రధాన నేతతో పాటు ఓ పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. నామాను తిరిగి ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా పోటీ చేయిస్తారని, ఇందుకు అనుగుణంగా ఒప్పందాలు కూడా కూదిరినట్లు తెలుస్తోంది.