పెళ్లి పీటలెక్కబోతున్న ఆమ్రపాలి

పెళ్లి పీటలెక్కబోతున్న ఆమ్రపాలి

22-01-2018

పెళ్లి పీటలెక్కబోతున్న ఆమ్రపాలి

వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి కాట పెళ్లి చేసుకోబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఢిల్లీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సమీర్‌ శర్మతో ఆమెకు ఇటీవలే వివాహం నిశ్చితార్థం జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే నెల 18న జమ్మూలో సమీర్‌ శర్మతో పెళ్లి జరిపేందుకు పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న వరంగల్‌ కలెక్టర్‌ బంగ్లాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పురప్రముఖుల సమక్షంలో రిసెప్షన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే 25న హైదరాబాద్‌లో కూడా గెట్‌ టు గెదర్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెలువరించే అవకాశాలున్నట్లు సమాచారం.