వీసా ఇంటర్వ్యూలకు రండి : యూఎస్ కాన్సులేట్

వీసా ఇంటర్వ్యూలకు రండి : యూఎస్ కాన్సులేట్

22-01-2018

వీసా ఇంటర్వ్యూలకు రండి : యూఎస్ కాన్సులేట్

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగనున్నాయి. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ నేపథ్యంలో పలు సందేహాలు తలెత్తాయి. యూఎస్‌ కాన్సులేట్‌ కార్యకలాపాలు స్తంభిస్తాయనే వాదనా వినిపించింది. దీనిపై కాన్సులేట్‌ సృష్టత ఇచ్చింది. షట్‌డౌన్‌ ప్రభావం ఉండదని, తమ కార్యకలాపాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. వీసాకి సంబంధించి ఇంటర్వ్యూలు ఉన్నవాళ్లు నిర్ణీత సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న కార్యాలయానికి రావచ్చని పేర్కొన్నారు.