గవర్నర్ గా వెళ్లను, ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

గవర్నర్ గా వెళ్లను, ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా

22-01-2018

గవర్నర్ గా వెళ్లను, ఎంపీగా మళ్లీ పోటీ చేస్తా

తాను గవర్నర్‌గా వెళ్లబోనని, ప్రజలతో ఉంటానని మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు.  తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అని అన్నారు.  తెలంగాణలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. కేంద్ర నిధులు ఇవ్వడం లేదని కేసీఆర్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం అధికంగా చేసిందని రెండేళ్లలో మిషన్‌ భగీరథకు రూ.3900 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.677 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుల వేగవంతానికి కేంద్రం పూర్తిగా సహకరిచిందన్నారు.