జపాన్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన

జపాన్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన

18-01-2018

జపాన్ లో కేటీఆర్ సుడిగాలి పర్యటన

 జపాన్‌లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, మునిపిసల్‌ శాఖ మంత్రి కే. తారకరామారావు, ఆయన వెంట ఉన్న బృందం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశాలు జరుపుతూ తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాయి. దక్షిణ కొరియా నుంచి జపాన్‌ వెళ్లిన మంత్రి బందం టోక్యోలో 12 పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. తెలంగాణలో ఉన్న విస్తత అవకాశాలను కేటీఆర్‌ వివరించారు. పారిశ్రామిక రంగం, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో జపాన్‌ అనుసరిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుంటామన్నారు. జపాన్‌ - తెలంగాణల మధ్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యానికి సహకారం అందించాలని జపాన్‌ రాయబారి సుజన్‌ చినోయ్‌ను కోరారు. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు జైకా వంటి జపాన్‌ ఆర్థిక సంస్థలు ఇప్పటికే రుణ సాయం అందించాయని గుర్తు చేశారు.