యాదాద్రిలో గోదా కల్యాణం

యాదాద్రిలో గోదా కల్యాణం

16-01-2018

యాదాద్రిలో గోదా కల్యాణం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి శ్రీ గోదాదేవి పాండురంగనాథుల పరిణయోత్సవం జరిగింది. ధనుర్మాస పూజలు చేపట్టిన విష్ణుచింతుని కుమార్తె గోదాదేవికి శ్రీరంగనాథుడు ప్రసన్నమై వివాహమాడే పర్యాలను బాలాలయంలో పూజారులు నిర్వహించారు. వైష్టవ ఆచారంగా అమ్మవారిని మండపంలో పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి యాదగిరీశుడిని రంగనాథుడిగా తీర్చిదిద్ది కల్యాణోత్సవ తతంగాలను చేపట్టారు. ప్రధాన పూజారులు, స్థానాచార్యుల సమక్షంలో జరిగిన గోదాదేవి కల్యాణంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.