తెలుగమ్మాయికి అరుదైన అవకాశం

తెలుగమ్మాయికి అరుదైన అవకాశం

16-01-2018

తెలుగమ్మాయికి అరుదైన అవకాశం

తెలుగమ్మాయికి అరుదైన అవకాశం లభించింది. షిప్‌ ఫర్‌ వర్డల్‌ యూత్‌ లీడర్స్‌ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీతేజ అనే యువతి ఎంపికైంది. జపాన్‌ ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి భారత్‌ నుంచి హాజరయ్యే 10 మంది బృందానికి శ్రీతేజ నేతృత్వం వహించనున్నారు. పార్లమెంట్‌ రీసెర్చి ఫెలోషిప్‌ విద్యార్థినిగా ఉన్న శ్రీ తేజను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వశాఖ ఎంపికచేసింది. యువతీ యువకుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించనున్న ఈ కార్యక్రమానికి 11 దేశాల నుంచి 240 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనిద్వారా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ప్రతినిధులను అవగాహన కల్పించనున్నారు.