మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

13-01-2018

మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన

ప్రపంచ ఆర్థికవేదిక (గ్లోబల్‌ ఎకనామిక్‌ ఫోరం) సదస్సు సహా పలు అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు హాజరు కావడంతో పాటు పెట్టుబడుల సమీకరణ, పారిశ్రామిక పార్కుల సందర్శన కోసం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ నెల 14 నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన దక్షిణ కొరియా, జపాన్‌, స్విట్జర్లాండ్‌లలో పర్యటించనున్నారు. ఈ నెల 15  నుంచి 22 వరకు ఆయన దక్షిణ కొరియా, జపాన్‌లను సందర్శించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. జౌళి, ఎలక్ట్రానిక్స్‌, ఔషధ రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చిస్తారు. 23 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతారు. 27న అక్కడి నుంచి బయల్దేరి హైదరాబాద్‌కి తిరిగొస్తారు.