సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

13-01-2018

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు రావాలని ముఖ్యమంత్రి భగవంతుడిని ప్రార్థించారు.