సీఎం కేసీఆర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

సీఎం కేసీఆర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

02-01-2018

సీఎం కేసీఆర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పవన్‌ కళ్యాణ్‌ నూత సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేసీఆర్‌ను పవన్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రగతిభవన్‌ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా పవన్‌ కళ్యాన్‌ తాను కొత్తగా స్థాపించిన పార్టీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ అంశాలు సైతం చర్చించినట్లు సమాచారం. కాగా ఇలా ఆకస్మాత్తుగా పవన్‌ కల్యాణ్‌ స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. మరో ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి పవన్‌ మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని, అందుకే పవన్‌, కేసీఆర్‌ భేటీ జరిగిందన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి.